పూరి-సేతుపతి టైటిల్ టీజర్ వస్తోంది!

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.;

By :  S D R
Update: 2025-09-26 10:29 GMT

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పూరీ కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్‌పై పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ కు ముహూర్తం ఫిక్సయ్యింది.

సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ బర్త్ డే స్పెషల్ గా ‘పూరి సేతుపతి‘ మూవీ టైటిల్ టీజర్ రివీల్ కానుంది. ఈ టైటిల్ టీజర్‌ను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హిట్ కోసం ఆత్రుతగా ఉన్న పూరి.. సేతుపతి మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.



Tags:    

Similar News