జాతకం జోష్‌లో ప్రియదర్శి
'కోర్ట్' మూవీతో బడా హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. ఇదే ఊపులో ఇప్పుడు 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.;
'కోర్ట్' మూవీతో బడా హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. ఇదే ఊపులో ఇప్పుడు 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే 'కోర్ట్' ఆద్యంతం సీరియస్ టోన్ లో ఉంటే.. 'సారంగపాణి జాతకం' ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్. సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు మరో ఇద్దరు కామెడీ స్టార్స్ వెన్నెల కిషోర్, వైవా హర్ష కూడా కీ రోల్స్ లో సందడి చేయబోతున్నారు. ప్రియదర్శికి జోడీగా రూప కొడువాయూర్ నటించింది. ఇతర కీలక పాత్రల్లో నరేష్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, శివన్నారాయణ, రాజా చేంబోలు కనిపించబోతున్నారు. ఏప్రిల్ 25న విడుదలకు ముస్తాబైన 'సారంగపాణి జాతకం' మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ చూస్తేనే ఇది పక్కా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న విషయం స్పష్టమవుతోంది. జాతకాన్ని నమ్మే యువకుడు ఎదుర్కొనే పరిస్థితులు, ప్రేమలో వచ్చే అడ్డంకులు అన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. ప్రియదర్శితో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష చేసే హాస్యానికి ట్రైలర్ ఓ ఫుల్ ఫన్ రైడ్‌లా మారింది. మొత్తానికి ఇంద్రగంటి-శివలెంక కాంబినేషన్‌లో వచ్చిన ‘జెంటిల్ మేన్, సమ్మోహనం’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు 'సారంగపాణి జాతకం'తో వీరు హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.