ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ భరోసా!

నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పై జీవిస్తున్న ఆయన, ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.;

By :  S D R
Update: 2025-07-04 14:31 GMT

నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పై జీవిస్తున్న ఆయన, ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా పనితీరును కోల్పోవడంతో, అతనికి వెంటనే కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. ఇందుకు సుమారు రూ. 50 లక్షల ఖర్చు అవుతుందని ఆయన కుమార్తె స్రవంతి తెలిపారు.

ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో మీడియా ద్వారా సహాయం కోరిన స్రవంతికి.. రెబల్ స్టార్ ప్రభాస్‌ బృందం స్పందించింది. ఫోన్ ద్వారా ప్రభాస్ టీమ్ ఆమెను సంప్రదించారట. 'కిడ్నీ దాతను సిద్ధం చేసుకోండి, ఆపరేషన్‌కు కావలసిన ఖర్చును మేమే భరిస్తాం' అని హామీ ఇచ్చిందని స్రవంతి తెలిపారు. ప్రభాస్ చూపిన ఈ ఉదారతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం వారి కుటుంబం కిడ్నీ దాత కోసం అన్వేషిస్తోంది. స్రవంతి మాటల ప్రకారం, తన రక్తం గ్రూప్‌ తండ్రికి మ్యాచ్ కాలేదని, తండ్రి తమ్ముడికి మ్యాచ్ అయినప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల అతనితో మార్పిడి సాధ్యం కాదని తెలిపారు. పలువురు ప్రముఖులు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కొంతవరకు సాయపడినప్పటికీ, ప్రభాస్ నుంచి స్పందన రావడం వారి కుటుంబానికి భరోసా అందిస్తోంది.

Tags:    

Similar News