'పోతుగడ్డ' ట్రైలర్.. అటు ప్రేమ, ఇటు రాజకీయం!
తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 'పోతుగడ్డ' మూవీ నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్‌గా రూపొందిన ఈ చిత్రం జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.;
తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 'పోతుగడ్డ' మూవీ నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్‌గా రూపొందిన ఈ చిత్రం జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఒక ప్రేమ జంట ఇంట్లో వారికి చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ జంట కర్నూలు-రాయచోటి బస్సులో ప్రయాణిస్తుండగా, అదే బస్సులో ఓ రాజకీయ నేతకు చెందిన కోట్ల డబ్బును ఎన్నికల కోసం తీసుకెళ్తారు. ఆ డబ్బును అడ్డుకునేందుకు ప్రత్యర్థులు బస్సుపై దాడి చేస్తారు. ఈ ఉద్రిక్తతల మధ్య ప్రేమజంట ఇరుక్కుపోతుంది. అయితే ఆ ప్రేమ జంటకు కూడా ఆ రాజకీయాలతో సంబంధం ఉందా? నిజంగా వారు ప్రేమికులేనా? అన్న ట్విస్ట్ ను ట్రైలర్ చివరిలో ఇచ్చాడు డైరెక్టర్ రక్ష వీరం.
'పోతుగడ్డ'.. 'ఎ టేల్ ఆఫ్ లవ్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీ లవ్ స్టోరీ, పొలిటికల్ డ్రామాగా అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో పృథ్వీ దండమూడి, విస్మయ హీరోహీరోయిన్లుగా నటించగా, ఆడుకాలమ్ నరేన్, శత్రు కీలక పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రాన్ని అనుపమ చంద్ర కోడూరి, డాక్టర్ శరత్ చంద్ర రెడ్డి నిర్మించారు. మొత్తంగా ట్రైలర్ అయితే ఇంప్రెస్సివ్ గా ఉంది. మరి ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.