'వీరమల్లు' కోసం పవన్ ప్రమోషన్స్!
‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి చర్చ జరుగుతున్నప్పుడల్లా అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం, ఆసక్తి కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది.;
‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి చర్చ జరుగుతున్నప్పుడల్లా అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం, ఆసక్తి కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన తొలి చారిత్రక నేపథ్యం చిత్రం. మొఘలుల కాలం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో పవన్ ఓ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రం గత కొన్నేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. షూటింగ్ ఆలస్యం, బడ్జెట్ సమస్యలు, రాజకీయ కారణాలు, ఇతర అనివార్య పరిస్థితులతో 'హరి హర వీరమల్లు' ఆలస్యమవుతూనే ఉంది. దాదాపు ఐదేళ్లుగా ఈ సినిమా చిత్రీకరణలో ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. నిర్మాత ఏ.ఎం. రత్నం ఓపిక, పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో ఈ సినిమా షూటింగ్ దశను దాటి, ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది.
జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు. సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ పలు ఇంటర్యూలు ఇవ్వడానికి.. ప్రెస్ మీట్స్ కు హాజరు కావడానికి అంగీకారం తెలిపాడట. మరోవైపు 'వీరమల్లు, ఓజీ' తర్వాత లేటెస్ట్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్'ని సైతం షురూ చేశాడు పవర్ స్టార్. మొత్తంగా పవర్ స్టార్ ఇప్పుడు రాజకీయ వ్యవహారాలను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెడుతున్నాడు.