పవన్ ‘మాట వినాలి‘ వెనుక అసలేం జరిగింది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పాటలు పాడటం కొత్తేమీ కాదు. అయితే పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీగా ఉంటూ.. కొత్త సినిమా ‘హరి హర వీరమల్లు‘ కోసం పాట పాడాడు పవన్.;

By :  S D R
Update: 2025-01-28 12:02 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పాటలు పాడటం కొత్తేమీ కాదు. అయితే పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీగా ఉంటూ.. కొత్త సినిమా ‘హరి హర వీరమల్లు‘ కోసం పాట పాడాడు పవన్. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతంలో ‘వీరమల్లు‘ కోసం పవన్ పాడిన ‘మాట వినాలి‘ ఇప్పటికే విడుదలైంది. ఈ పాటను కేవలం తెలుగులోనే కాదు పలు భాషల్లో పవన్ కళ్యాణ్ పాడటం విశేషం.

పవన్ పాడిన ‘మాట వినాలి‘ పాట వెనుక విషయాలకు సంబంధించి బిహైండ్ ది సీన్స్ వీడియోని చిత్రబృందం విడుదల చేయబోతుంది. అసలు పవన్ కళ్యాణ్ ‘మాట వినాలి‘ పాట పాడడానికి ఏ విధంగా సిద్ధమయ్యాడు? అందుకు సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన సలహాలు ఏమిటి? వంటివి ఈ బి.టి.ఎస్. వీడియోలో అలరించబోతున్నట్టు తెలుస్తోంది. రేపు (జనవరి 29) మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ‘మాట వినాలి‘ బి.టి.ఎస్. వీడియో విడుదల కాబోతుంది.

Tags:    

Similar News