'పట్టుదల' ట్రైలర్.. అజిత్ స్టైలిష్ ఎంటర్టైనర్!
By : T70mm Team
Update: 2025-01-16 14:24 GMT
తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్ సినిమాలు అంటేనే ఊర మాస్ యాక్షన్ తో అలరిస్తాయి. ఈసారి అజిత్ ఓ భిన్నమైన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. అజిత్ లేటెస్ట్ మూవీ 'విడాముయార్చి' తెలుగులో 'పట్టుదల' పేరుతో వస్తుంది.
ఆద్యంతం అజర్ బైజాన్ కంట్రీ బాక్ డ్రాప్ లో మగిళ్ తిరుమేని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా త్రిష నటించింది. ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టబోతున్నాయని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.