'కాంత' నుంచి 'పసి మనసే'
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.;
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. రానా దగ్గుబాటి, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1950ల కాలంలో సినీ నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది. ముఖ్యంగా అప్పటి మద్రాస్ నేపథ్యంలో మానవ బంధాలు, సామాజిక మార్పులను ప్రధానంగా చూపించే కథ ఇది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌లో దుల్కర్ రెట్రో లుక్‌లో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పసి మనసే’ అంటూ మెలోడీ సాంగ్ విడుదలైంది. జాను చంతర్ స్వరపరిచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్‌కే ఆలపించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.