‘ఓ భామ అయ్యో రామ‘ ట్రైలర్
కమెడియన్ గా ప్రారంభమై.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుహాస్. లేటెస్ట్ గా కీర్తి సురేష్ తో నటించిన ‘ఉప్పు కప్పురంబు‘ మూవీ ఓటీటీలోకి వచ్చింది.;
కమెడియన్ గా ప్రారంభమై.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుహాస్. లేటెస్ట్ గా కీర్తి సురేష్ తో నటించిన ‘ఉప్పు కప్పురంబు‘ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే నెలలో మరో చిత్రం ‘ఓ భామ అయ్యో రామ‘తో థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈనెల 11న థియేటర్లలోకి రాబోతున్న ‘ఓ భామ అయ్యో రామ‘ ట్రైలర్ రిలీజయ్యింది.
రామ్ గోదాల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సుహాస్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. మధ్యలో హీరోయిన్ మాళవిక మనోజ్ తో లవ్ స్టోరీ.. అయితే అనుకోని ప్రమాదంలో ప్రేయసి దూరమవ్వడం.. అన్నీ తట్టుకుని చివరకు అతను చిత్ర సీమలో దర్శకుడిగా రాణించాడా? అనేది ఈ మూవీ స్టోరీగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
ఈ సినిమాలో డైరెక్టర్స్ హరీష్ శంకర్, మారుతి కూడా అతిథి పాత్రల్లో అలరించబోతున్నారు. వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ సినిమాని హీరో రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు.