'ఓజీ' రిలీజ్ డేట్ లాక్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయని ఎంతో నమ్మకంతో ఉన్నారు అభిమానులు.;

By :  S D R
Update: 2025-04-23 01:23 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయని ఎంతో నమ్మకంతో ఉన్నారు అభిమానులు. పవన్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరి హర వీరమల్లు' మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఆ తేదీకి 'వీరమల్లు' రావడం కష్టమే అని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.

మరోవైపు పవర్ స్టార్ 'ఓజీ' చిత్రం కూడా ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. పవన్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. లేటెస్ట్ గా 'ఓజీ' చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ 5న శివ కార్తికేయన్-మురుగదాస్ కాంబో మూవీ 'మదరాసి' విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' రూపొందుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉండబోతుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఆ పాటను కోలీవుడ్ స్టార్ శింబు పాడటం విశేషం. మొత్తంగా.. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి 'హరి హర వీరమల్లు, ఓజీ' రూపంలో డబుల్ ధమాకా ఉంటుందేమో చూడాలి.

Tags:    

Similar News