‘ఓదెల 2’ ప్రీ-రిలీజ్ బిజినెస్ అదరహో!
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రానున్న చిత్రాలలో 'ఓదెల 2' ఒకటి. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి దర్శకుడు సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.;
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రానున్న చిత్రాలలో 'ఓదెల 2' ఒకటి. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి దర్శకుడు సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ గా 'ఓదెల 2' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
'ఓదెల 2' సినిమా థియేట్రికల్ హక్కుల రూపంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ తో కలిపి రూ.10 కోట్లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్-థియేట్రికల్ హక్కులు రూ.18 కోట్లకు క్లోజ్ అయినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, ఈ సినిమా విడుదలకు ముందే రూ.28 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.
ఇలాంటి మీడియం మూవీస్ లో ఈ రేంజ్ బిజినెస్ గ్రేట్ అని చెప్పొచ్చు. మిల్కీ బ్యూటీ తమన్నా కాస్త గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్న చిత్రమిది. ఇప్పటికే హిట్టైన ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే టీజర్ తో అలరించిన 'ఓదెల 2' ట్రైలర్ రేపు వస్తోంది. డివోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో అలరించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలోకి రాబోతుంది.