ఎన్టీఆర్ కొత్త లుక్ – పెళ్లి వేడుకలో వైరల్ ఫోటో!

Update: 2025-02-23 05:30 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వీటిలో 'వార్ 2' ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్‌కు చేరుకోగా ప్రశాంత్ నీల్‌ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకుంది. అయితే ప్రశాంత్ నీల్ సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టే తరుణం కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.





 


మరోవైపు ఎన్టీఆర్ దుబాయ్ లో సందడి చేస్తున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్ కు తన సతీమణి లక్ష్మీ ప్రణతి తో కలిసి హాజరయ్యాడు. ఈ వేడుకలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోధ్కర్ కూడా కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో కనిపించగా, ఈ స్టైల్ పై అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. రఫ్ అండ్ టఫ్ లుక్స్‌తో అలరించే తారక్ ఈ సారి స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ గెటప్ మారుస్తున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News