తమిళనాడులో ఎన్టీఆర్ క్రేజ్!

రాబోయే ఆగస్టులో రజనీకాంత్ ‘కూలీ‘, ఎన్టీఆర్ ‘వార్ 2‘ చిత్రాలు ఒకే రోజు విడుదలకు ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే ను టార్గెట్ చేస్తూ ఈ రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.;

By :  S D R
Update: 2025-06-25 07:04 GMT

రాబోయే ఆగస్టులో రజనీకాంత్ ‘కూలీ‘, ఎన్టీఆర్ ‘వార్ 2‘ చిత్రాలు ఒకే రోజు విడుదలకు ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే ను టార్గెట్ చేస్తూ ఈ రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అలాగే ఈ రెండు చిత్రాలు క్రేజీ మల్టీస్టారర్స్ కావడం మరో విశేషం. రజనీకాంత్ ‘కూలీ‘ సినిమాలో పలు భాషల నుంచి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇక ‘వార్ 2‘లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించబోతున్నాడు.

బిజినెస్ విషయానికొస్తే ‘కూలీ‘ సినిమాకోసం తెలుగు రాష్ట్రాల్లోని నిర్మాతలు పోటీ పడుతున్నారనే న్యూస్ రెగ్యులర్ గా వినిపిస్తున్నదే. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా రైట్స్ రూ.45 కోట్లకు పైగా పలుకుతుందట. మరోవైపు ఎన్టీఆర్ ‘వార్ 2‘కి సైతం తమిళనాడులో భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది.

లేటెస్ట్ గా ‘వార్ 2‘ తమిళ హక్కులను థింక్ స్టూడియోస్ దక్కించుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘వార్ 2‘ తమిళనాడు రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు పొందిందట థింక్ స్టూడియోస్. ఆగస్టులో వచ్చే ఎన్టీఆర్ ‘వార్ 2‘ తో పాటు.. జూలై 11న విడుదలకానున్న అనుష్క ‘ఘాటి‘ తమిళ హక్కులను సైతం థింక్ స్టూడియోస్ పొందటం విశేషం.



Tags:    

Similar News