హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పాట – ప్రోమో రీలీజ్!
హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పాట – ప్రోమో రీలీజ్!పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆస్కార్ విజేత కీరవాణి స్వరకల్పనలో రూపొందిన ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే గీతం రెండో పాటగా రాబోతుంది. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.
'కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో..' అంటూ మంగ్లీ స్వరంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు అనసూయ వంటి వారు సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఆలపించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఈ గీతం విడుదలకానుంది.