రూటు మార్చిన నయనతార
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కథ, తారాగణం పరంగానే కాకుండా ప్రమోషనల్ వ్యూహాల పరంగా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కథ, తారాగణం పరంగానే కాకుండా ప్రమోషనల్ వ్యూహాల పరంగా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక ప్రోమో వీడియోలో భాగమవ్వడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా చేసింది.
సినిమాపై ఎంత ప్రేమ ఉన్నా నయనతార ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే నటి. అలాంటి ఆమె ఈసారి మాత్రం తన స్టైల్‌ను పక్కన పెట్టి, చిరు-అనిల్ కోసం ముందుకొచ్చింది. చిరంజీవి డైలాగ్‌ను రీక్రియేట్ చేస్తూ, స్క్రిప్ట్‌ను ఉత్సాహంగా చదువుతూ కనిపించిన ఈ ప్రోమో వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీడియో చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా నయనతారతో ప్రత్యక్షమవుతూ.. వచ్చే సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అంటూ ‘ఘరానా మొగుడు‘లో మెగాస్టార్ స్టైల్ లో రెచ్చిపోయారు.
గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘ ప్రచారంలో హీరో వెంకటేష్, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో పాటు అనిల్ రావిపూడి చేసిన ప్రచార సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు మెగా 157 కోసమూ అదే తరహా స్ట్రాటజీని అవలంబిస్తున్నాడు అనిల్. ఈ సినిమా ముహూర్తంలోనే మెగాస్టార్ తో ప్రత్యేకమైన వీడియో చేసిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు నయనతార వీడియోతో మరోసారి తన మార్క్ చూపించాడు.