నాని ఇన్ టు 'ది ప్యారడైజ్'!
సెలెక్టివ్ స్టోరీలతో, నేచురల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ప్రస్తుతం 'హిట్ 3'ని విడుదలకు ముస్తాబు చేస్తున్న నేచురల్ స్టార్.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'ను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.;
సెలెక్టివ్ స్టోరీలతో, నేచురల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ప్రస్తుతం 'హిట్ 3'ని విడుదలకు ముస్తాబు చేస్తున్న నేచురల్ స్టార్.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'ను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ తో అంచనాలు పెంచిన 'ది ప్యారడైజ్' ప్రపంచంలోకి నాని అడుగు పెడుతున్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' మే 2 నుంచి సెట్స్ పైకి వెళుతుందట. ఇక మే 15 నుంచి ఈ చిత్రంలో నాని అధికారికంగా జాయిన్ అవుతాడట. 1980ల సికింద్రాబాద్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, పారడైజ్ హోటల్ పరిసరాల్లో నివసించే ప్రజల కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
గత కొద్ది సినిమాల్లో భిన్నమైన పాత్రలతో ప్రయోగాలు చేస్తున్న తీరు చూస్తే, నాని 'ది ప్యారడైజ్'లో బౌండరీలు చెరిపేసే రోల్ చేస్తాడనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలోని తన రోల్ కోసం నాని మేకోవర్ ఎంతో కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమాకోసం సిక్స్ ప్యాక్ బాడీలోనూ మెస్మరైజ్ చేయనున్నాడు నేచురల్ స్టార్. 2026, మార్చి 26న పాన్ వరల్డ్ రేంజులో 'ది ప్యారడైజ్' రిలీజ్ కు రెడీ అవుతుంది.