మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు !

షేన్ నిగమ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘బాల్టీ’ అనే స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాలో సెల్వరాఘవన్ తొలిసారి గా నటించబోతున్నాడు.;

By :  K R K
Update: 2025-08-24 00:49 GMT

కోలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సెల్వరాఘవన్. తన ఇంటెన్స్ అండ్ యూనిక్ డైరెక్టోరియల్ స్టైల్‌తోనూ, తన అద్భుతమైన నటనతోనూ ఎప్పుడూ సినీ లవర్స్‌ని ఆకట్టుకుంటాడు. ఇప్పుడు ఈ మాస్టర్ స్టోరీటెల్లర్ మలయాళ సినిమాలో కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షేన్ నిగమ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘బాల్టీ’ అనే స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాలో సెల్వరాఘవన్ తొలిసారి గా నటించబోతున్నాడు.

ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాని మిక్స్ చేస్తూ ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ గురించి హైప్ ఓ రేంజ్‌లో ఉంది. సెల్వరాఘవన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలియగానే, సినీ ఫ్యాన్స్‌లో సర్‌ప్రైజ్ మామూలుగా లేదు.

షేన్ నిగమ్, మలయాళ సినిమాలో ఇప్పటికే తన యాక్టింగ్‌తో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ స్టార్. ఈ సినిమాతో మరోసారి సెంటర్ స్టేజ్ తీసుకోబో తున్నాడు. ‘బాల్టీ’ కి ఇప్పటివరకూ వచ్చిన బజ్ చూస్తే.. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచేలా కనిపిస్తోంది. సెల్వరాఘవన్ యాక్టింగ్‌లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు? ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? అనేది చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News