ప్రేమ్ జీ అమరన్ ‘వల్లమై’ చిత్రానికి సెన్సార్ పూర్తి !
నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్ జీ అమరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వల్లమై. దర్శకుడు కరుప్పయ్య మురుగన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే, ప్రేమ్ జీ అమరన్ తన కూతురితో కలిసి ఏదో రహస్యమైన పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, చిత్ర కథా విషయాలను మాత్రం ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు.
దర్శకుడు కరుప్పయ్య మురుగన్ 2022లో ‘విడియత ఇరవొండ్రు వెండాం’ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణం కూడా చేశారు. ఆయన ఇప్పుడు ‘వల్లమై’ చిత్రానికి కథ, పాటలు రాస్తూ, బాట్లర్స్ సినిమా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ప్రేమ్ జీ అమరన్ మొదటిసారిగా వల్లవన్ చిత్రంలో నటుడిగా ప్రవేశించగా, అనంతరం దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రాల్లో తరచుగా కనిపిస్తూ వచ్చారు. ఇటీవల విడుదలైన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రంలో విజయ్, ‘మైక్’ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, అజ్మల్, మీనాక్షి చౌదరి వంటి ప్రముఖ నటులతో కలిసి ప్రేమ్జీ కూడా కీలక పాత్ర పోషించారు.