పృధ్విరాజ్ లేటెస్ట్ మూవీ ‘సంతోష్ ట్రోఫీ’

ఈ సరికొత్త చిత్రంలో పృథ్వీరాజ్‌తో పాటు 60 మంది కొత్త నటీనటులు కూడా పాల్గొంటారు. ఈ కొత్త నటీనటులను తిరువళ్లలో ఆడిషన్స్ నిర్వహించి, ఎర్నాకుళంలో ఫైనల్ చేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.;

By :  K R K
Update: 2025-09-25 01:32 GMT

మాలీవుడ్ యూత్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా.. 'జయ జయ జయ జయ హే' చిత్ర దర్శకుడు విపిన్ దాస్ రూపొందిస్తున్న చిత్రం 'సంతోష్ ట్రోఫీ' . ఈ సరికొత్త చిత్రంలో పృథ్వీరాజ్‌తో పాటు 60 మంది కొత్త నటీనటులు కూడా పాల్గొంటారు. ఈ కొత్త నటీనటులను తిరువళ్లలో ఆడిషన్స్ నిర్వహించి, ఎర్నాకుళంలో ఫైనల్ చేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

'సంతోష్ ట్రోఫీ' ఒక కుటుంబ కథా చిత్రం అని, దీనిని లిస్టిన్ స్టీఫెన్ తన మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై, సుప్రియా మీనన్ తన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. విపిన్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో 'గురువాయూరలంబల నడయిల్' తర్వాత ఇది రెండో సినిమా. అలాగే, మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఐదవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరూ 'డ్రైవింగ్ లైసెన్స్', 'జన గణ మన', 'కడువ', 'గోల్డ్' వంటి చిత్రాలను నిర్మించారు.

'సంతోష్ ట్రోఫీ' సినిమా అధికారిక ప్రకటన 2024లో పృథ్వీరాజ్ పుట్టినరోజున టైటిల్ పోస్టర్‌తో జరిగింది. ఈ సినిమా కథాంశం, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పృథ్వీరాజ్ ప్రస్తుతం జయన్ నంబియార్ దర్శకత్వంలో 'విలాయత్ బుద్ధ', నిస్సామ్ బషీర్ దర్శకత్వంలో 'ఐ', నోబడీ, వైశాఖ్ దర్శకత్వంలో 'ఖలీఫా', ఎస్. మహేష్ దర్శకత్వంలో 'కాలియన్' వంటి పలు చిత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

Tags:    

Similar News