లెజెండరీ గాయకుడు ఏసుదాస్ కు యం.యస్ సుబ్బలక్ష్మి పురస్కారం
గాయకుడు కె.జె. యేసుదాస్‌కు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పురస్కారం లభించింది. సంగీత రంగానికి ఆయన చేసిన కృషికి గాను తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది.;
తమిళనాడు ప్రభుత్వం నుంచి లెజెండరీ మలయాళ గాయకుడు కె.జె. యేసుదాస్‌కు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పురస్కారం లభించింది. సంగీత రంగానికి ఆయన చేసిన కృషికి గాను తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ఇక గాయని శ్వేత మోహన్, నటి సాయి పల్లవిలకు కలైమామణి పురస్కారం దక్కింది. సాయి పల్లవికి 2021కి గానూ, శ్వేతకు 2023కి గానూ కలైమామణి పురస్కారం లభించింది. వచ్చే నెలలో చెన్నైలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది.
నటుడు ఎస్.జె. సూర్య, దర్శకుడు లింగుస్వామి కూడా సాయి పల్లవితో పాటు 2021కి గానూ కలైమామణి పురస్కారానికి ఎంపికయ్యారు. నటులు విక్రమ్ ప్రభు, జయ వి.సి. గుహనాథన్, గేయ రచయిత వివేక, పీఆర్వో డయమండ్ బాబులకు 2022కి గానూ కలైమామణి పురస్కారం లభించింది. శ్వేత మోహన్‌తో పాటు 2023కి గానూ ఈ అవార్డును నటులు మణికందన్, జార్జ్ మారియన్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ కుమార్, పీఆర్వో నిఖిల్ మరుగన్ పంచుకోనున్నారు.