ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కు ఈ హీరోనే కావాలి !

Update: 2025-03-03 04:07 GMT

ఆకర్షణీయమైన లుక్స్ గానీ, గొప్ప ఫిజిక్ గానీ లేకపోయినా.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయమైనప్పుడు ‘లవ్ టుడే’ చిత్రం విషయంలో చాలామంది సందేహపడ్డారు. కానీ.. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అందరి నోర్లు మూతపడ్డాయి. అయితే.. అప్పట్లో ప్రదీప్ సరసన నటించేందుకు ఏ హీరోయిన్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ.. ఇప్పుడది పూర్తిగా మారిపోయింది.

‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రాలతో వరుసగా రెండు విజయాలు అందుకున్న ప్రదీప్.. ప్రస్తుతం 100 కోట్ల విలువైన హీరోగా మారిపోయాడు. అతడికి దర్శకత్వమే మొదటి ఇష్టం అయినా.. ఇప్పుడు హీరోగా మరింత దృష్టిపెట్టక తప్పట్లేదు. ప్రదీప్ తదుపరి ప్రాజెక్టులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఇప్పటివరకు ఇవానా, అనుపమ పరమేశ్వరన్, మమితా బైజు వంటి నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రదీప్.. హీరోయిన్ల విలువను పెంచుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఆయనతో నటించేందుకు వెనుకడుగేసిన నాయికలు, ఇప్పుడు స్వయంగా ముందుకు వచ్చి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ లో కయాదూ, అనుపమ పరమేశ్వరన్‌తో రొమాన్స్ చేసిన ప్రదీప్, తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ను అందించిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు ప్రదీప్ ప్రధాన పాత్రలో కీర్తీశ్వరన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తోంది. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. మేజర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ, ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఇవి మాత్రమే కాదు.. ప్రదీప్ చేతిలో ప్రస్తుతం మూడు లేదా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆయన క్రేజ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

Tags:    

Similar News