ఈ దర్శకుడి 1వ చిత్రానికి, 100వ చిత్రానికి ఒకే హీరో !

ప్రఖ్యాత దర్శకుడు ప్రియదర్శన్ 100వ సినిమాను రూపొందించనుండగా.. అందులో మోహన్‌లాల్ హీరోగా నటించనున్నట్టు ఆయన ధృవీకరించారు.;

By :  K R K
Update: 2025-03-22 04:36 GMT

మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న L2: ఎంపురాన్ మార్చి 27, 2025న విడుదల కానుంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే.. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ప్రఖ్యాత దర్శకుడు ప్రియదర్శన్ 100వ సినిమాను రూపొందించనుండగా, అందులో మోహన్‌లాల్ హీరోగా నటించనున్నట్టు ఆయన ధృవీకరించారు.

ఒక మీడియా ఇంటరాక్షన్ లో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. "ప్రియదర్శన్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమాలో నేను కథానాయకుడిగా నటించాను. ఇప్పుడు, ఆయన మరో రెండు సినిమాలు పూర్తి చేసుకున్నాక, అతని 100వ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమా కోసం మేమిద్దరం మళ్లీ కలిసి పనిచేయనున్నాం. మొదటి సినిమా, 100వ సినిమా ఒకే దర్శకుడు, ఒకే నటుడు." అని తెలిపారు.

ప్రియదర్శన్ 1984లో తన దర్శకత్వ ప్రయాణాన్ని "పూచ్చక్కొరు మూక్కుత్తి" (తెలుగులో ‘గోపాలరావు గారి అమ్మాయి’) అనే మలయాళ కామెడీ సినిమాతో ప్రారంభించారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు శంకర్, మేనక, ఎం. జి. సోమన్, నెడుముడి వేణు, సి. ఐ. పాల్, సుకుమారి, జగతి శ్రీకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో స్క్రూబాల్ కామెడీలకు నాంది కావడం విశేషం.

Tags:    

Similar News