మమ్ముట్టి ‘బజూకా’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో మమ్ముట్టి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. బ్లాక్ సూట్, కూల్ షేడ్స్ ధరించిన ఆయన, ఓ వింటేజ్ కార్ పక్కన నిలబడి ఉన్నారు.;
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘బజూకా’ సినిమా విడుదల తేదీ మారింది. నిజానికి ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా వాయిదా పడింది. తాజాగా మమ్ముట్టి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘బజూకా’ ప్రపంచవ్యాప్తంగా 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో మమ్ముట్టి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. బ్లాక్ సూట్, కూల్ షేడ్స్ ధరించిన ఆయన, ఓ వింటేజ్ కార్ పక్కన నిలబడి ఉన్నారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్ పరిశీలిస్తే, ఒక ఫ్యాక్టరీ ప్రాంతం, పొగలు కక్కుతున్న యంత్రాలు కనిపిస్తున్నాయి. ఇది సినిమా మూడ్‌ను సూచించేలా ఉంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ద్వారా ‘బజూకా’ చిత్ర విశేషాలను ఆడియన్స్‌తో పంచుకుంటూ, అంచనాలను పెంచుతున్నారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను దీను డెన్నిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా.. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ తన మలయాళ దర్శక అరంగేట్ర చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్’ పర్స్’ లోనూ మమ్ముట్టితో పని చేశారు. ఇప్పుడు ‘బజూకా’ లో ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంకా.. సిద్ధార్థ్ భరతన్, హకీం షాజహాన్, భామా అరుణ్, బాబు ఆంటోని, దివ్యా పిల్లై, స్పడికం జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మళయాళ నూతన సంవత్సరమైన విశూ కానుకగా విడుదల కావడం.. కేరళ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించనుంది. ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో ‘బజూకా’ సునామీ చూడాల్సిందే!