'పేట్రియాట్' కోసం లండన్‌కు మమ్ముట్టి !
లండన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మమ్ముట్టి తన టీమ్‌తో దిగిన వీడియోను ఆంటో రిలీజ్ చేశారు. ఆ క్లిప్‌లో, అభిమానులు భారీగా తరలిరావడంతో.. మమ్ముట్టి చిరునవ్వుతో వారితో పలకరింపులు, ముచ్చట్లు జరిపి, ఆ తర్వాత లగ్జరీ రోల్స్ రాయిస్ కారులో ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లడం కనిపించింది.;
డైరెక్టర్ మహేశ్ నారాయణన్ డ్రీమ్ ప్రాజెక్ట్, మోస్ట్-అవైటెడ్ పొలిటికల్ స్పై థ్రిల్లర్ 'పేట్రియాట్' నెక్స్ట్ షెడ్యూల్ కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లండన్ చేరుకున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌ను సినిమా నిర్మాత ఆంటో జోసెఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లండన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మమ్ముట్టి తన టీమ్‌తో దిగిన వీడియోను ఆంటో రిలీజ్ చేశారు. ఆ క్లిప్‌లో, అభిమానులు భారీగా తరలిరావడంతో.. మమ్ముట్టి చిరునవ్వుతో వారితో పలకరింపులు, ముచ్చట్లు జరిపి, ఆ తర్వాత లగ్జరీ రోల్స్ రాయిస్ కారులో ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
'పేట్రియాట్' హైదరాబాద్ షెడ్యూల్ రీసెంట్‌గా పూర్తయింది. లండన్ షెడ్యూల్ ఈ సినిమాకు చాలా కీలకం. ఈ కొత్త షెడ్యూల్ అక్టోబర్ 15న స్టార్ట్ అయ్యి, డిసెంబర్ మధ్య వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను ఆంటో జోసెఫ్, సి ఆర్ సలీమ్, సుభాష్ మాన్యువల్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో మమ్ముట్టితో పాటు.. మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, జరీన్ షిహాబ్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. 'డుంకీ', 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' వంటి హిందీ సినిమాలకు పనిచేసిన మానుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
పవర్, గూఢచర్యం, స్టేట్ కంట్రోల్ వంటి హై-వాల్యూ పాయింట్స్‌తో వస్తున్న 'పేట్రియాట్'.. మలయాళంలో మోస్ట్-అంబిషియస్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెబుతున్నారు. ముఖ్యంగా, దశాబ్దం తర్వాత మమ్ముట్టి - మోహన్‌లాల్ కాంబో రిపీట్ కావడంతో.. ఈ ఏడాది రిలీజైన టీజర్ ఫ్యాన్స్‌లో అంచనాలను డబుల్ చేసింది. ఈ సినిమా విషు కానుకగా 2026 లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక, మమ్ముట్టి నటించిన 'కలంకావల్' సినిమా త్వరలో అంటే నవంబర్‌లో థియేటర్లలోకి రానుంది.