టైటిల్ ఉచ్ఛారణ కోసం గైడ్ ను విడుదల చేసిన మేకర్స్

మేకర్స్ ఈ చిత్రం లాటిన్ టైటిల్ చుట్టూ ఉన్న గందరగోళాన్ని నివృత్తి చేయడానికి దాని ఉచ్చారణ గైడ్‌ను విడుదల చేశారు.;

By :  K R K
Update: 2025-09-29 07:48 GMT

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నట వారసుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన అప్ కమింగ్ మలయాళ హారర్ థ్రిల్లర్ 'డైస్ ఇరే'. మేకర్స్ ఈ చిత్రం లాటిన్ టైటిల్ చుట్టూ ఉన్న గందరగోళాన్ని నివృత్తి చేయడానికి దాని ఉచ్చారణ గైడ్‌ను విడుదల చేశారు. తాజాగా చిత్ర బృందం దానిని సరిగ్గా పలికే విధానాన్ని ("డీ-ఎస్ ఈ-రే") ప్రదర్శిస్తూ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది.

ఈ పదబంధం "డే ఆఫ్ రాత్" (ఆగ్రహ దినం) అనే అర్ధాన్ని ఇస్తుంది. ఇది తీర్పు, మరణానికి సంబంధించిన ఒక మధ్యయుగ లాటిన్ శ్లోకం నుండి వచ్చింది. ఈ చిత్రం హారర్ జోనర్ లో వెంటాడే ఆత్మల ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. ఆగస్టులో టీజర్ విడుదలైనప్పటి నుండి ఈ టైటిల్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘భ్రమయుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించగా.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రణవ్‌తో పాటు, 'సూక్ష్మదర్శిని' నటుడు మనోహరి జాయ్, 'వాళ', '2018', 'ఫాలిమి', 'కన్నూర్ స్క్వాడ్', 'కిష్కింధ కాండం' చిత్రాలలో నటించిన జిబిన్ గోపీనాథ్ కూడా నటిస్తు్న్నాడు. అక్టోబర్ 31న హాలోవీన్ సందర్భంగా 'డైస్ ఇరే' విడుదల కాబోతోంది. ఈ సంవత్సరం మోస్ట్ అవైటింగ్ హారర్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. 

Tags:    

Similar News