సూపర్ హీరోస్ లోకంలోకి దుల్కర్ అండ్ టోవినో

అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడానికి.. మేకర్స్ టొవినో అండ్ దుల్కర్ నటించిన టీజర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ కూడా ఈ సిరీస్‌లో చార్లీ పాత్ర పోషిస్తున్నాడు.;

By :  K R K
Update: 2025-09-28 01:24 GMT

తాజాగా దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘లోక’ సూపర్‌హీరో సిరీస్‌లో మొదటి భాగం.. చంద్ర అద్భుత విజయాన్ని అందుకుంది. ఇది మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ చిత్రాన్ని అధిగమించి.. మలయాళ సినిమా చరిత్రలోనే ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు.. ఈ సిరీస్ యూనివర్స్‌లోని ఇతర సూపర్‌హీరోలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

రెండవ భాగం పేరు లోక: చాప్టర్ 2 మైఖేల్.. ఇది టొవినో థామస్ జీవితంపై దృష్టి సారిస్తుంది. నిర్మాతలు ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడానికి.. మేకర్స్ టొవినో అండ్ దుల్కర్ నటించిన టీజర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ కూడా ఈ సిరీస్‌లో చార్లీ పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా విడుదలైన టీజర్‌లో.. టొవినో అండ్ దుల్కర్ ఇద్దరూ సరదా సంభాషణలో నిమగ్నమై ఉన్నారు. టొవినో ఉల్లాసంగా ఉండే పాత్రను పోషించగా, దుల్కర్ ఎక్కువగా రిజర్వ్‌డ్‌గా కనిపిస్తాడు. టొవినో, దుల్కర్‌ను టచ్‌లో ఉండమని అడుగుతూ ఆటపట్టించడానికి ప్రయత్నిస్తాడు, కానీ దుల్కర్ నిరాశక్తత చూపిస్తాడు. చివరికి, టొవినో తన సోదరుడితో ఉన్న సమస్యల గురించి దుల్కర్‌కు చెప్పి సహాయం కోరతాడు.

దుల్కర్ ఆ అభ్యర్థనను తిరస్కరించగా.. గోబ్లిన్స్ తన కోసం వస్తారని, అందుకే తప్పక సహాయం చేయాలని టొవినో ఒప్పిస్తాడు. అప్పుడు దుల్కర్ అవసరమైనప్పుడు కాల్ చేయమని టొవినోతో చెబుతాడు. సిరీస్‌లో భాగం కాబోతున్న మూత్తోన్ (పెద్దన్నయ్య) గురించి కూడా వారు మాట్లాడుకుంటారు. ఈ పాత్రను మమ్ముట్టి పోషించే అవకాశం ఉంది.


Full View


Tags:    

Similar News