‘పెద్ది’ ఆఫర్ ను అందుకే తిరస్కరించాను : శ్వాసిక

40 ఏళ్ల రామ్ చరణ్ కంటే ఏడేళ్లు చిన్నది. ఆమె తమిళ, మలయాళ సినిమాల్లో మధ్యవయస్క పాత్రలు పోషించినప్పటికీ, తనకంటే వయసులో పెద్దవారికి తల్లి పాత్ర చేయడం సౌకర్యంగా అనిపించలేదని ఆమె తెలిపింది.;

By :  K R K
Update: 2025-08-26 00:49 GMT

రామ్ చరణ్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. అతడితో కలిసి పనిచేసే అవకాశాన్ని ఏ నటీమణులైనా వదులుకోరు. అతడి సినిమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించడం చాలామందికి కలలాంటిది. అయితే, మలయాళ నటి శ్వాసిక మాత్రం రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా సమాచారం శ్వాసికను రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం సంప్రదించారు. 33 ఏళ్ల శ్వాసిక.. 40 ఏళ్ల రామ్ చరణ్ కంటే ఏడేళ్లు చిన్నది. ఆమె తమిళ, మలయాళ సినిమాల్లో మధ్యవయస్క పాత్రలు పోషించినప్పటికీ, తనకంటే వయసులో పెద్దవారికి తల్లి పాత్ర చేయడం సౌకర్యంగా అనిపించలేదని ఆమె తెలిపింది. శ్వాసిక తన కెరీర్‌లో ఈ దశలో అలాంటి పాత్రలకు సిద్ధంగా లేనని, అందుకే చాలా సంప్రదింపులు జరిగినప్పటికీ ఆ ఆఫర్‌ను గట్టిగా తిరస్కరించినట్లు వెల్లడించింది.

ఆమె ఇటీవల నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించింది. అయితే ఆమె రామ్ చరణ్ సినిమాను తిరస్కరించిన విషయం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. 'పెద్ది' సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ క్రీడాకారుడి పాత్రలో, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చ్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

Tags:    

Similar News