మమ్ముట్టితో వార్ కు తలపడుతున్న యంగ్ హీరో !

ఓవైపు మెగాస్టార్ మమ్ముట్టి, మరోవైపు యంగ్ మల్టీటాలెంటెడ్ హీరో బాసిల్ జోసెఫ్. ఈ ఇద్దరూ తలపడబోతున్న సినిమాలు ఒక్కే రోజున థియేటర్లలోకి రావడం విశేషం.;

By :  K R K
Update: 2025-04-05 03:10 GMT

ఏప్రిల్ 10న మళయాళ సినీ ప్రపంచంలో ఒక రేర్ క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు మెగాస్టార్ మమ్ముట్టి, మరోవైపు యంగ్ మల్టీటాలెంటెడ్ హీరో బాసిల్ జోసెఫ్. ఈ ఇద్దరూ తలపడబోతున్న సినిమాలు ఒక్కే రోజున థియేటర్లలోకి రావడం విశేషం. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మమ్ముట్టి సినిమా ‘బజూక’. గతంలో ‘డొమినిక్ ది లేడీ పర్స్’ లాంటి ప్లాప్ తర్వాత ఈసారి గట్టిగా బ్యాక్‌ఫైర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు మలయాళ మెగాస్టార్.

గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బజూకా’ చిత్రం ఇప్పటికే విడుదల తేదీల మార్పులతో పలుమార్లు వార్తల్లో నిలిచింది. ట్రైలర్ విడుదల తర్వాత, సినిమా మీద బజ్ మళ్లీ పెరిగింది. సైబర్ యాక్షన్ కథతో భిన్నమైన కాన్సెప్ట్‌కు తెరలేపినట్టు కనిపిస్తోంది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి దూసుకురానుంది.

సరికొత్తగా, స్వయంగా డైరెక్షన్‌తో పాటు యాక్టింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్న యంగ్ హీరో బాసిల్ జోసెఫ్. ‘సూక్ష్మదర్శినీ’, ‘పొన్మన్’ లాంటి చిత్రాల్లో తన యాక్టింగ్ టాలెంట్ ప్రూవ్ చేసిన బాసిల్, ఈసారి ‘మరణమాస్’ అనే చిత్రంతో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. కామెడీ కమ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు టొవినో థామస్ బ్రదర్స్ ప్రొడ్యూసర్లు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో విషు పండుగ రోజే అంటే ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించినా, వీకెండ్ మరియు సెలవులు కలిసొస్తుండటంతో ఏప్రిల్ 10న సినిమాను ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

విషు పండుగను టార్గెట్ చేస్తూ, వారం ముందే విడుదలయ్యే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ విందుకు సిద్ధమయ్యాయి. మెగాస్టార్ మమ్ముట్టికి తిరిగి మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలన్న ఛాలెంజ్ మరోవైపు బాసిల్ జోసెఫ్‌కు కొత్త తరహా పాత్రతో నిలదొక్కుకోవాలన్న కసి. ఇప్పుడు ప్రశ్న మాత్రం ఒక్కటే. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు? ఏది ఏమైనా.. మలయాళ సినీ ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఫెస్టివల్ మూడ్ తో కట్టుదిట్టమైన రెండు సినిమాలతో థియేటర్లు సందడిగా మారనున్నాయి. మాస్ వర్సెస్ మల్టీటాలెంట్ ఏప్రిల్ 10 రిజల్ట్ ఏంటో చూద్దాం!

Tags:    

Similar News