భారతీయ చిత్రాలకు ఆసియన్ ఫిల్మ్ అవార్డ్స్ !
ఈ క్రమంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’.;
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంటూ.. భారతీయ సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’. కనికుసృతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది.
ముంబయిలోని ఓ నర్సింగ్ హోమ్‌లో పని చేసే ఇద్దరు నర్సుల జీవిత కథ ఆధారంగా దర్శకురాలు పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మరో కీలక విజయాన్ని సాధించింది. హాంగ్‌కాంగ్‌లో నిర్వహించిన 18వ ఆసియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రంగా ఎంపికై ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది.
ఈ వేడుకలో ఇతర భారతీయ చిత్రాలు కూడా గుర్తింపు పొందాయి. ‘సంతోష్’ అనే సినిమాకు గాను షహానా గోస్వామి ఉత్తమ నటిగా అవార్డు అందుకోగా.. సంధ్యా సూరి ఉత్తమ నూతన దర్శకురాలిగా ఎంపికయ్యారు. భారతీయ సినిమాలు అంతర్జాతీయ వేదికలపై ప్రభావం చూపిస్తున్న ఈ విజయాలు భారతీయ సినీప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.