బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్న మెగా కజిన్స్!

మెగా ఫ్యామిలీ హీరోలలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఎవరికి వారు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఇప్పుడు కామన్ గా గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు.;

By :  S D R
Update: 2025-02-09 14:19 GMT

మెగా ఫ్యామిలీ హీరోలలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఎవరికి వారు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఇప్పుడు కామన్ గా గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. 'RC16' కోసం చరణ్ గడ్డాన్ని పెంచగా.. 'సంబరాల ఏటిగట్టు' కోసం సాయితేజ్, మేర్లపాక గాంధీ చిత్రం కోసం వరుణ్ తేజ్.. గుబురు గడ్డాలతో సరికొత్తగా సందడి చేస్తున్నారు.

లేటెస్ట్ గా చరణ్, సాయి, వరుణ్ ఒకే జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ముగ్గురు మెగా హీరోలు బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్న ఈ పిక్ మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News