మోహన్ లాల్ సినిమాను మొదలెట్టిన ‘మాస్టర్’ బ్యూటీ

Update: 2025-02-23 06:20 GMT

మోహన్ లాల్ సినిమాను మొదలెట్టిన ‘మాస్టర్’ బ్యూటీఅందాల హీరోయిన్ మాళవిక మోహనన్ మాలీవుడ్ లో తన కెరీర్‌లోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పుడు కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తోంది. మాళవిక తండ్రి మోహనన్ కుటుంబం కేరళకు చెందినవాడే. చిన్నప్పటి నుండి మోహన్‌లాల్ సినిమాలు, సత్యన్ ఆంతిక్కాడ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు చూసి పెరిగిందని ఆమె చెప్పింది. ఇప్పుడు.. అదే దర్శకుడితో, అదే స్టార్‌తో ఆమె నటించడం నిజంగా గ్రేటే.

మోహన్‌లాల్ కథానాయకుడిగా నటిస్తున్న “హృదయపూర్వం” సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది మాళవిక మోహనన్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సత్యన్ ఆంతిక్కాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మాళవిక మోహనన్ ప్రారంభించింది.

సెట్లో తన అనుభూతులను పంచుకుంటూ మాళవిక సోషల్ మీడియాలో... “నా సినీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఇది ఒకటి. మలయాళ సినిమా దిగ్గజాలైన మోహన్‌లాల్ సర్, సత్యన్ ఆంతిక్కాడ్ సర్ తో పని చేయడం నిజంగా నా కల సాకారం అయినట్లుంది” అని పేర్కొంది. తెలుగులో మాళవిక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సరసన “ది రాజా సాబ్” చిత్రంలో నటిస్తోంది.

Tags:    

Similar News