సూపర్ హీరోగా మాస్‌ మహారాజా!

మాస్ మహారాజ రవితేజ తన కెరీర్‌లో నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాస్ రాజా 'మాస్ జాతర' చిత్రంలో నటిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-03-23 06:24 GMT

మాస్ మహారాజ రవితేజ తన కెరీర్‌లో నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాస్ రాజా 'మాస్ జాతర' చిత్రంలో నటిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రమిది.

'మాస్ జాతర' తర్వాత రవితేజ తన 76వ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. మరోవైపు తన 77వ సినిమాని కూడా లైన్లో పెట్టాడు రవితేజ. 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ తో రవితేజ-75 రూపొందనుంది.

కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో 'మ్యాడ్' చిత్రం విజయం సాధించడంతో, దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' రూపొందింది. మార్చి 28న 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ తన మూడో చిత్రాన్ని రవితేజాతో చేయబోతున్నట్టు స్పష్టం చేశాడు. మాస్ మహారాజ కోసం ఓ సూపర్ హీరో స్టోరీని సిద్ధం చేస్తున్నాడట కళ్యాణ్ శంకర్. సితారలో రూపొందే ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి, 2026 లో విడుదల చేయాలని భావిస్తున్నారట.

Tags:    

Similar News