శ్రీరామ నవమికి మాస్ ఫీస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'.;

By :  S D R
Update: 2025-03-30 11:01 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా నుంచి ఇటీవల రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా రిలీజైన టైటిల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఉగాది కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వస్తుందని భావించారు మెగా ఫ్యాన్స్.

అయితే గ్లింప్స్ రాకపోయినా.. ఆ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ అందించారు. తాజాగా, మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ జెండాలతో నిలిచిన గుంపు మధ్యలోకి దూకుతూ మాస్ అప్పీల్‌ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్ ఇప్పటికే ఫ్యాన్స్‌కి అద్భుతమైన కిక్ ఇచ్చేసింది. అంతేకాదు, గ్లింప్స్ ఎప్పుడొస్తుందో కూడా అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 6న 'పెద్ది' ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.

Tags:    

Similar News