మంచు ఫ్యామిలీ.. మళ్లీ ఒక్కటవ్వాలి!

నటుడు మంచు మనోజ్‌ తన మనసులోని బాధను ఇటీవల ‘భైరవం’ ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించాడు. కుటుంబ విభేదాలు ఎంతగానో బాధించాయనే విషయంలో ఎమోషనల్‌ అయిన మనోజ్, తండ్రి మోహన్‌బాబును కౌగిలించుకోవాలని, కూతురిని ఆయన ఒడిలో పెట్టాలని తలచుకుంటున్నట్లు చెప్పాడు.;

By :  S D R
Update: 2025-05-25 07:26 GMT

నటుడు మంచు మనోజ్‌ తన మనసులోని బాధను ఇటీవల ‘భైరవం’ ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించాడు. కుటుంబ విభేదాలు ఎంతగానో బాధించాయనే విషయంలో ఎమోషనల్‌ అయిన మనోజ్, తండ్రి మోహన్‌బాబును కౌగిలించుకోవాలని, కూతురిని ఆయన ఒడిలో పెట్టాలని తలచుకుంటున్నట్లు చెప్పాడు.

‘భైరవం‘ ప్రమోషన్స్ లో తన స్పీచ్ లో శివయ్యా అనే డైలాగ్‌పై సెటైర్లు వేయడం తప్పని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో ‘కన్నప్ప‘ చిత్రం టీంకు క్షమాపణలు చెప్పడం, తన వ్యాఖ్యలు ఎమోషనల్‌ కారణంగానే వచ్చాయని, దురుద్దేశం ఏదీ లేనని మనోజ్‌ స్పష్టం చేశాడు.

అలాగే తల్లి, అక్కను మిస్ అవుతున్నానన్న విషయాలు, కుటుంబాన్ని మళ్లీ కలిపే దిశగా మనోజ్ మనసు ఎలా అడుగులు వేస్తోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ‘నమ్మకంగా దేవుణ్ని ప్రార్థిస్తున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటున్నా‘ అనే మనోజ్ మాటలే ఇందుకు నిదర్శనం.

మరోవైపు మంచు కుటుంబాన్ని ఒక్కటి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తమ్మారెడ్డి భరద్వాజ కూడా అన్నారు. మొత్తంగా.. త్వరలోనే మంచు కుటుంబంలోని అన్నాదమ్ముల మధ్య విభేదాలు ముగిసిపోయి.. మళ్లీ కలిస్తే బాగుంటుందని సినీ అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Tags:    

Similar News