'మోనిక'ను మించిపోయిన మలయాళీ స్టార్!

సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి భారీ తారాగణంతో రూపొందిన మల్టీస్టారర్ ‘కూలీ’.;

By :  S D R
Update: 2025-07-14 01:08 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి భారీ తారాగణంతో రూపొందిన మల్టీస్టారర్ ‘కూలీ’. ఈ సినిమా కాస్టింగ్ లో ఈ అగ్ర నటులతో పాటు.. మరో వ్యక్తి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. అతనే మలయాళీ స్టార్ సౌబిన్ షాహిర్.

మలయాళ సినీ ప్రపంచంలో సౌబిన్ ఓ విలక్షణ నటుడు. ‘సుదాని ఫ్రమ్ నైజీరియా’ సినిమాతో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం ద్వారా ఉత్తమ నటుడిగా కేరళ స్టేట్ అవార్డ్ అందుకున్నాడు. ఆ తర్వాత 'కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచమ్, మంజుమ్మల్ బాయ్స్' వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2024లో సౌబిన్ నటించి నిర్మించిన 'మంజుమ్మల్ బాయ్స్' వందల కోట్లు వసూలు చేసి మలయాళ చిత్రసీమలో సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ‘కూలీ’లో సౌబిన్ కీలకమైన నెగటివ్ రోల్ 'దయాల్'గా కనిపించబోతున్నాడు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ‘మోనికా’ ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డేతో కలిసి అతడు వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన డాన్స్ మూమెంట్స్ చూసిన నెటిజన్లు సూపర్ ఫిట్ డాన్సర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడి లుక్స్ సాదాసీదాగా ఉన్నప్పటికీ, పెర్ఫామెన్స్‌లో మాత్రం అందరినీ ఆకర్షించే సత్తా ఉందని ఈ పాటతో మరోసారి రుజువైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది.

Tags:    

Similar News