మహేష్ - రాజమౌళి అడ్వెంచర్ బిగిన్స్!
మహేష్ సినిమా గురించి రాజమౌళి ఓ పోస్ట్ పెట్టాడు. బ్యాక్ గ్రౌండ్ లో సింహం (మహేష్ బాబు)ని బంధించినట్టు.. ఆయన పాస్‌పోర్టును తాను క్యాప్చర్ చేసినట్టు ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'SSMB29'. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లాంఛ్ కార్యక్రమాన్ని చాలా సింపుల్‌గా పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కూడా సైలెంట్ గా షురూ చేశాడు జక్కన్న.
సౌతాఫ్రికా అడవుల్లో అడ్వంచరస్ డ్రామాగా రూపొందే ఈ మూవీ కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఫిక్సయ్యింది. టీమ్ అంతా ఇప్పుడు సౌతాఫ్రికా బయలుదేరుతున్నట్టు తెలుస్తోంది. ఇండైరెక్ట్ గా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ స్పెషల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాఉ రాజమౌళి.
బ్యాక్ గ్రౌండ్ లో సింహం (మహేష్ బాబు)ని బంధించినట్టు.. ఆయన పాస్‌పోర్టును తాను క్యాప్చర్ చేసినట్టు ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టుకి మహేష్ బాబు 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అని కామెంట్ చేయగా.. ప్రియాంక చోప్రా 'ఫైనల్లీ' అంటూ కామెంట్ పెట్టింది. మొత్తంగా మహేష్-రాజమౌళి సినిమా సందడి ఎట్టకేలకు మొదలైందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్.
మరోవైపు ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేయాలని రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజులో 'SSMB29' రూపొందుతుంది.
https://www.instagram.com/p/DFN7ihLzH0D/?hl=en