మహాదేవ శాస్త్రి పరిచయ గీతం

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది.;

By :  S D R
Update: 2025-03-17 14:55 GMT
మహాదేవ శాస్త్రి పరిచయ గీతం
  • whatsapp icon

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రను పోషించిన డాక్టర్ ఎం.మోహన్ బాబు పుట్టినరోజు (మార్చి 19) సందర్భంగా 'మహాదేవ శాస్త్రి పరిచయ గీతం'ను విడుదల చేయనున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను పోషించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే 'కన్నప్ప' నుంచి స్టీఫెన్ దేవస్సీ స్వరకల్పనలో విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు మూడో పాటగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 25న 'కన్నప్ప' ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Tags:    

Similar News