సుమతో ‘మ్యాడ్ స్క్వేర్’ మజా!
‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది.;
‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
మార్చి 28న విడుదలకు ముస్తాబైన ‘మ్యాడ్ స్క్వేర్‘ ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది టీమ్. లేటెస్ట్ గా హీరో సంగీత్ శోభన్ యాంకర్ గా వ్యవహరిస్తూ.. నిర్మాత నాగవంశీ, దర్శకుడు కళ్యాణ్ శంకర్ లతో చేసిన ఇంటర్యూకి మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్‘ టీమ్ మరో ఇంటర్యూతో రెడీ అవుతుంది. సుమ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ లేటెస్ట్ ఇంటర్యూకి సంబంధించి ప్రోమో రిలీజయ్యింది. ‘మ్యాడ్ స్క్వేర్‘ సినిమా ఆన్ స్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విశేషాలతో ఈ ఇంటర్యూ రెడీ అయినట్టు ప్రోమోను చూస్తే తెలుస్తోంది. రేపు ఈ ఇంటర్యూ రాబోతుంది.