యు.ఎస్.లో అదరగొడుతున్న 'మ్యాడ్ స్క్వేర్'!

యంగ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యాడ్ స్క్వేర్'కి అంతటా పాజటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.;

By :  S D R
Update: 2025-03-28 13:13 GMT

యంగ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యాడ్ స్క్వేర్'కి అంతటా పాజటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే మంచి హైప్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ, యూఎస్ మార్కెట్‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

అమెరికాలోని ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమా గట్టి వసూళ్లను రాబడుతోంది. డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ‘మ్యాడ్ స్క్వేర్’ 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇది ఈ తరహా యూత్ ఎంటర్‌టైనర్‌కు మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు.

ఈ వీకెండ్ వరకే యు.ఎస్. లో 'మ్యాడ్ స్క్వేర్' వన్ మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం 'మ్యాడ్ స్క్వేర్' వసూళ్లు ఓ రేంజులో ఉండబోతున్నాయనే అంచనాలు మొదలయ్యాయి. ఉగాది, రంజాన్ వంటి ఫెస్టివల్స్ కలిసి రావడం 'మ్యాడ్ స్క్వేర్'కి మరింత ప్లస్ కానుంది.

Tags:    

Similar News