‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌.. ఇద్దరమ్మాయిల ప్రేమలో అబ్బాయి

ఇద్దరమ్మాయిలతో ఒకేసారి లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో అనే ఆసక్తికరమైన కథాంశంతో రాబోతున్న చిత్రం ‘లవ్‌ ఓటిపి’. ఇందులో ‘ఓటిపి.. అంటే ఓవర్ టార్చర్ ప్రెసర్‘.;

By :  S D R
Update: 2025-10-11 10:22 GMT

ఇద్దరమ్మాయిలతో ఒకేసారి లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో అనే ఆసక్తికరమైన కథాంశంతో రాబోతున్న చిత్రం ‘లవ్‌ ఓటిపి’. ఇందులో ‘ఓటిపి.. అంటే ఓవర్ టార్చర్ ప్రెసర్‘. భవప్రీతా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై విజయ్‌ యం. రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అనీష్‌, జాన్విక‌, స్వరూపిణి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. 2 నిమిషాల 27 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా, యూత్‌ఫుల్‌ ఎనర్జీతో నిండిపోయింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించే అబ్బాయి పరిస్థితులను ఎంటర్ టైనింగ్ గా చూపించారు. చివరిలో సినిమా ఎమోషనల్ గానూ ఆకట్టుకోనున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

‘ఫ్రెష్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ‘లవ్‌ ఓటిపి’ ద్వారా ప్రేక్షకులకు కొత్త రకం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాం. హీరోగానూ, దర్శకుడిగానూ అనీష్‌ మంచి పేరు తెచ్చుకుంటాడు‘ అని నిర్మాత విజయ్‌ యం. రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమాకి ఆనంద్‌ రాజా విక్రమ్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, హర్ష సినిమాటోగ్రఫీ, బాబా భాస్కర్‌ డాన్స్‌, విక్రమ్‌ మోర్‌ యాక్షన్‌ సమకూరుస్తున్నారు. ‘లవ్‌ ఓటిపి’ త్వరలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View


Tags:    

Similar News