ఈసారి ప్రీక్వెల్ అంటోన్న ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వీటిలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ భారీ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు.;
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వీటిలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ భారీ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ‘ఫౌజీ‘ కోసం ప్రీక్వెల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడట హను రాఘవపూడి. ఇప్పటివరకూ ప్రభాస్ సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ గా మారింది. ఇప్పుడు ‘ఫౌజీ‘తో ప్రీక్వెల్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు డార్లింగ్.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తుంది. కీలక పాత్రల్లో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ ఖేర్ వంటి వారు కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2026, ఆగస్టులో విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట.