క్రేజీ కాంబో సెట్టయ్యింది!

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్‌లు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఈసారి వస్తున్న కాంబో మాత్రం నిజంగానే క్రేజీ. పాన్‌–ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా, క్రియేటివ్ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోందట.;

By :  S D R
Update: 2025-10-11 02:28 GMT

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్‌లు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఈసారి వస్తున్న కాంబో మాత్రం నిజంగానే క్రేజీ. పాన్‌–ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా, క్రియేటివ్ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోందట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్‌.

ఇండస్ట్రీ బజ్ ప్రకారం సుకుమార్‌ రెండు వారాల క్రితం ప్రభాస్‌కు ఓ పవర్‌ఫుల్‌ కథ వినిపించగా, కథ పట్ల బాగా ఇంప్రెస్‌ అయిన ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘పుష్ప 3’ కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ప్లాన్‌లో సుకుమార్ ఉన్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో 'ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి-2, సలార్ 2' వంటి చిత్రాలున్నాయి. మరోవైపు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమాని పూర్తి చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబో మూవీని దిల్‌రాజు తన బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట.మొత్తంగా.. త్వరలోనే ప్రభాస్-సుకుమార్ క్రేజీ కాంబో సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News