'గ్లోబ్ ట్రోటర్' పై లేటెస్ట్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ వరల్డ్ వైడ్ గా మోస్ట్ అవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమా గురించి టాక్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ మూవీ థీమ్, టోన్ ఎలా ఉంటుందో చూపే ఒక గ్లింప్స్ ను నవంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ముందుగా అనుకున్నట్లుగా ఈ సినిమా రాకపోవచ్చని, బదులుగా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అయ్యే ప్లాన్ ఉందని లేటెస్ట్ అప్‌డేట్స్ చెబుతున్నాయి.
'గ్లోబ్ ట్రోటర్' గా పిలుచుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం 2027లో థియేటర్లలోకి రావొచ్చని, అందులోనూ మార్చి 26, 2027 చుట్టూ రిలీజ్ డేట్ ఉండొచ్చని కొందరు ఊహిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే రెండో భాగం 2029 లో విడుదల కావచ్చని సమాచారం. రాజమౌళితో 'ఆర్ ఆర్ ఆర్ ' చేసిన రామ్ చరణ్ ఒకసారి సరదాగా ఈ సినిమా 2026 జూలై లేదా ఆగస్టులో రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చినా, రెండు భాగాల రిలీజ్ ప్లానే ఎక్కువగా వినిపిస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం... ఆఫ్రికన్ కథలు, పురాణాల స్ఫూర్తితో రూపొందిన ఒక ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ సినిమా అని, ఇందులో అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే కథ ఉంటాయని తెలుస్తోంది.