బిలియనీర్ క్లబ్‌లో బాలీవుడ్ బాద్షా
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మొదటిసారిగా బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. దీనితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా నిలిచారు. భారతదేశంలోని అత్యంత ధనవంతుల వార్షిక ర్యాంకింగ్ అయిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, 59 ఏళ్ల షారుఖ్ ఖాన్ నికర విలువ 1.4 బిలియన్ డాలర్స్ గా అంచనా వేయబడింది.
దీని ద్వారా, ఆయన ప్రపంచంలోని ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, పాప్ స్టార్ రిహానా, గోల్ఫర్ టైగర్ వుడ్స్, మరియు గాయని టేలర్ స్విఫ్ట్ వంటి ప్రముఖుల సరసన చేరారు. వీరి నికర విలువను ఫోర్బ్స్ పత్రిక 1.6 బిలియన్లుగా అంచనా వేసింది.
ఈ జాబితాలో ఉన్న ఇతర బాలీవుడ్ ప్రముఖులలో నటి జూహీ చావ్లా, నటులు హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, సినీ దర్శకుడు కరణ్ జోహార్ ఉన్నారు.
బాలీవుడ్ లో 'కింగ్' అని పిలుచుకొనే షారుఖ్, హిందీ చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా స్టార్ గా కొనసాగుతున్నారు. ఆయన నటుడి స్థాయి నుంచి ప్రధాన నిర్మాణ సంస్థను నడపడం, అలాగే క్రికెట్ జట్టును సొంతం చేసుకోవడం ద్వారా తనను తాను కొత్తగా మలుచుకున్నారు.
"ఖాన్ బిలియనీర్ హోదాకు ప్రధాన కారణం రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ [ఆయన నిర్మాణ సంస్థ] మరియు నైట్ రైడర్ స్పోర్ట్స్ [ఆయన IPL క్రికెట్ క్లబ్]లలో ఆయనకు ఉన్న వాటాలే" అని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, చీఫ్ రిసెర్చర్ అయిన అనస్ రెహమాన్ జునైద్ తెలిపారు.