కోలీవుడ్ స్టార్ సూర్య సరికొత్త బ్యానర్ ‘ళగరం’
కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, సూర్య త్వరలో ‘ళగరం' అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించబోతున్నాడు.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొన్ని సినిమాలు కమర్షియల్ గా పరాజయాలుగా నిలిచాయి. అయితే.. ఇటీవల 'లక్కీ భాస్కర్' అనే సూపర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా.. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కరుప్పు' అనే సినిమా కూడా సూర్య చేతిలో ఉంది. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.
సూర్యకు '2డి ఎంటర్‌టైన్‌మెంట్' అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, సూర్య త్వరలో ‘ళగరం' అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించబోతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈ హీరో ఇప్పటికే 'ఆవేశం' దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో తన 47వ సినిమా చేయడానికి అంగీకరించాడు.
తాత్కాలికంగా 'సూర్య47' అని పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్.. 'ళగరం' బ్యానర్ నిర్మించే తొలి సినిమాగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా, పా రంజిత్ కూడా ఈ కొత్త బ్యానర్ పై ఒక సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని, చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.