సూర్య -జ్యోతికలకు పుత్రికోత్సాహం !
ఆమె కేవలం 17 ఏళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 'లీడింగ్ లైట్' అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి... డైరెక్టర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టింది.;
సాధారణంగా, స్టార్ హీరోలు తమ పిల్లల్ని కనీసం వాళ్ల మిడ్ 20స్ వరకైనా చదువుల మీదే దృష్టి పెట్టేలా చూస్తారు. సినిమా ప్రపంచం యువతకు చాలా కష్టంగా ఉంటుంది.. కాబట్టి వాళ్లని దానికి దూరంగా ఉంచడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ, సూర్య, జ్యోతికల కూతురు దియా విషయంలో మాత్రం ఇది జరగలేదు. ఆమె కేవలం 17 ఏళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 'లీడింగ్ లైట్' అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి... డైరెక్టర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టింది.
చాలా మంది స్టార్ కిడ్స్ కెమెరా ముందుకొస్తే.. దియా మాత్రం తెర వెనుక పనిచేయడానికి ఇష్టపడింది. ముఖ్యంగా, ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక అంశంపై ఫోకస్ పెట్టింది. 'లీడింగ్ లైట్' అనేది 13 నిమిషాల డాక్యు-డ్రామా. ఇది బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు మహిళా గాఫర్‌ల (లైటింగ్ టెక్నీషియన్లు) స్ఫూర్తిదాయక కథలను చెబుతుంది. వాళ్లెవరంటే.. హెతాల్ దేధియా, ప్రియాంక సింగ్, మరియు లీనా గంగూర్డే. ఈ లైటింగ్ విభాగంలో సాధారణంగా మగవాళ్లే ఎక్కువ ఉంటారు.
ఈ ఫిల్మ్‌లో వాళ్ల పోరాటాలు.. పట్టుదల, ఇంకా ఈ కష్టమైన రంగంలో పాత ఆచారాలను ఎలా బద్దలు కొట్టి విజయం సాధించారో చూపించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఒక అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు లాస్ ఏంజిల్స్‌లోని రీజెన్సీ థియేటర్‌లో దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఆస్కార్-క్వాలిఫైయింగ్ రన్లో భాగం. అంటే.. ఈ సినిమా 2026 అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీకి పరిశీలనకు అర్హత సాధిస్తుంది.
సూర్య, జ్యోతికల 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ ప్రాజెక్ట్ సినిమా రంగంలో పెద్దగా వెలుగు చూడని మహిళా టెక్నీషియన్లను ప్రపంచానికి పరిచయం చేస్తుందని గర్వంగా చెబుతూ, ఆ ఇద్దరు పేరెంట్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు.