కాంప్రమైజ్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ !

1982లో వచ్చిన ‘సకలకలా వల్లవన్’ సినిమాలోని ‘ఇళమై ఇదో ఇదో’, 1986లో వచ్చిన ‘విక్రమ్’ సినిమాలోని ‘ఎన్ జోడి మంజ కురువి’, ఇంకా.. 1996లో వచ్చిన ‘నట్టుపుర పాట్టు’ సినిమాలోని ‘ఒత్త రూవా’ పాటలను ఈ సినిమాలో ఉపయోగించారు.;

By :  K R K
Update: 2025-09-20 04:56 GMT

లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా.. తన పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించినందుకు సౌత్ ఫిల్మ్ మేకర్స్‌పై పలు లీగల్ కేసులు ఫైల్ చేశారు. కొందరు కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు వచ్చారు. మరికొందరు లీగల్ ఇబ్బందులను తప్పించడానికి రాజీ చేసుకున్నారు. అజిత్ నటించిన రీసెంట్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంది.

దీంతో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. 1982లో వచ్చిన ‘సకలకలా వల్లవన్’ సినిమాలోని ‘ఇళమై ఇదో ఇదో’, 1986లో వచ్చిన ‘విక్రమ్’ సినిమాలోని ‘ఎన్ జోడి మంజ కురువి’, ఇంకా.. 1996లో వచ్చిన ‘నట్టుపుర పాట్టు’ సినిమాలోని ‘ఒత్త రూవా’ పాటలను ఈ సినిమాలో ఉపయోగించారు. ఇళయరాజా ఈ సినిమా నిర్మాతల నుంచి రూ. 5 కోట్లు పరిహారంగా డిమాండ్ చేశారు.

దీనికి బదులుగా, నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాటలను సినిమా నుంచి తొలగించి, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను మళ్లీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందు బాటులోకి తెచ్చారు. నిన్న రాత్రి నుంచి అప్‌డేటెడ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. రూ. 5 కోట్లు చెల్లించడం లేదా లీగల్ ఇబ్బందులను ఎదుర్కోవడం కంటే ఇది నిర్మాతల నుంచి సమంజసమైన నిర్ణయం. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందించాడు. అజిత్, అధిక్ రవిచంద్రన్, మైత్రీ మూవీ మేకర్స్ మరో సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు, దీని షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Tags:    

Similar News