4 సినిమాల్ని లైన్ లో పెట్టిన లోకనాయకుడు

ప్రస్తుతం కమల్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో మొదటి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అన్బరివ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.;

By :  K R K
Update: 2025-09-19 07:24 GMT

లోక నాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమా నిర్మాతగా ఆయనకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది. ఆయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో చివరగా ఆయన నటించిన 'థగ్ లైఫ్' భారీ పరాజయం పాలైనప్పటికీ, కమల్ హాసన్ ఆ సినిమా ద్వారా ఎలాంటి డబ్బు నష్టపోలేదు.

ప్రస్తుతం కమల్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో మొదటి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అన్బరివ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.

అలాగే.. రెడ్ జెయింట్ ఫిల్మ్స్ తో కలిసి కమల్ హాసన్ తన తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ అండ్ రజినీకాంత్ దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభ మవుతుంది.

అలాగే, కమల్ హాసన్ సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రతిభావంతుడైన దర్శకుడు యస్ యూ అరుణ్ కుమార్ తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వచ్చే సంవత్సరం ప్రకటిస్తారు. మొత్తానికి ఈ లెజెండరీ నటుడు ఇప్పుడు నిర్మాతగా కొన్ని అద్భుతమైన చిత్రాలను నిర్మించబోతున్నారు.

Tags:    

Similar News