‘మదరాసి’ కాంబో రిపీట్ కానుందా?
తమిళ మీడియా సమాచారం ప్రకారం.. ‘మదరాసి’ కాంబినేషన్ త్వరలో మరోసారి రిపీట్ కానుందని అంటున్నారు. శివకార్తికేయన్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రాథమికంగా ఓకే చెప్పినట్లు సమాచారం.;
‘మదరాసి’ సినిమా ఏఆర్ మురుగదాస్‌కు మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచింది, ఎందుకంటే ఆయన వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ఈ సినిమా మంచి ఆదరణ పొందగా.. శివకార్తికేయన్ నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తన తదుపరి సినిమా కోసం బిజీ అవుతున్నాడు. తమిళ మీడియా సమాచారం ప్రకారం.. ‘మదరాసి’ కాంబినేషన్ త్వరలో మరోసారి రిపీట్ కానుందని అంటున్నారు. శివకార్తికేయన్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రాథమికంగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని టాక్. త్వరలోనే అన్ని విషయాలు ఖరారు కానున్నాయి.
శివకార్తికేయన్.. తమిళంలో ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే, ‘అయలాన్’ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నాడు. అంతేకాక, వెంకట్ ప్రభుతో ఒక ప్రాజెక్ట్ కోసం శివకార్తికేయన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.