ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా పడింది !
ఈ సంఘటన కారణంగా, 'జన నాయగన్' సినిమా నిర్మాతలు సినిమా మొదటి పాట విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాట వాస్తవానికి అక్టోబర్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.;
తమిళ దళపతి విజయ్ ప్రస్తుతం సినిమాలతో, రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. అతడు గత సంవత్సరం ‘తమిళగ వెట్రి కజగం’ అనే తన రాజకీయ పార్టీని స్థాపించాడు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాకముందు అతడు నటించే చివరి సినిమా ‘జన నాయగన్’ అని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తూనే, 2026 తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు విజయ్.
సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో విజయ్ రాజకీయ సభలో ఒక ఘోర విషాదం జరిగింది. ఈ కార్యక్రమం కరూర్-ఈరోడ్ హైవేపై ఉన్న వేలుసామిపురం వద్ద జరిగింది. విజయ్ కాన్వాయ్ దాదాపు ఏడు గంటలు ఆలస్యం కావడంతో, అతడు ఎట్టకేలకు అక్కడికి చేరుకున్నప్పుడు, అతడ్ని చూడటానికి జనం ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగి.. అందులో 41 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన విజయ్, అతడి పార్టీపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ సంఘటన కారణంగా, 'జన నాయగన్' సినిమా నిర్మాతలు సినిమా మొదటి పాట విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాట వాస్తవానికి అక్టోబర్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాను మాత్రం పొంగల్ 2026కి విడుదల చేయాలని ఇప్పటికీ యోచిస్తున్నారు.